అగ్నిబానా మేసి యంబుధి నింకించు
రాముడవలి కేగ రాక, నిలిచి
చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము
మహిమతో మహాసముద్రాన్ని ఇంకించిన వారైనా సరే మానవ ప్రయత్నంలో సేతువు కట్టందే ఆ దరి చేరుకోలేరు. పూజవల్ల కాదు, పూనుకవల్ల ఏదైనా నెరవేరుతుంది.