తెలుగు బిడ్డ
ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి వేరేపోవువాడు వెర్రివాడు కుక్కతోక పట్టి గోదారీదినా? విశ్వదాభిరామ వినుర వేమ!
భార్య మాటలు విని అన్నదమ్ములను ఏవగించుకొని వేరింటి కాపురం పెట్టడం వెర్రితనం. ఇది కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడం వంటిది.