తెలుగు బిడ్డ
కప్పకు నొరగాలైనను సప్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!
కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైనా, ముసలితనంలో దారిద్య్రం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి.