తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల

తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల 
నొనర శివుని జూడ నుపమ గలదు 
మనసు చదరనీక మహిలోన జూడరా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము

జనులు తపస్సు చేసి కృశించుట వ్యర్థము. భగవంతుని చూచుటకిది మార్గము కాదు. మనస్సును చెదరనీయక స్థిరముగా నుంచి ధ్యానించినచో దేవున్ని చూడవచ్చును