తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడనతకు తత్వమగును
వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము
దేవుడి అందరి హృదయాలలో ఉంటాడు. చిత్తశుద్ధితో ఆత్మ పరిశీలన చేసుకుంటే అతడు కనిపిస్తాడు. ఎలాంటి వికరాలకు లొంగకుండా ఆ తత్వాన్ని దర్శించేవాడే నిజమైన యోగి.