ఆటంకంగా నిలవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి అభివృద్ధికి కానీ, అభీష్టానికి కానీ ఆటంకం కలిగిస్తూ ఇబ్బంది పెడుతుండే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం జరుగుతుంటుంది.
మానవ స్వభావాల విశ్లేషణను కూడా మన జాతీయాలు తమలో పొందుపరచుకొని ముందు తరాలకు అందిస్తుంటాయనటానికి ఈ జాతీయం ఒక ఉదాహరణ. సృష్టిలో సున్నితమైన మనస్తత్వంగల స్త్రీ మానవీయతను ప్రకటిస్తుంది. పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకొనేదాకా వూరుకోడు. కానీ స్త్రీ అలాకాదు.
కొంతమంది స్వార్థపరులు, అవకాశవాదుల మనస్తత్వాన్ని వివరించే జాతీయం ఇది. అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే లాంటిదే ఇది. తనకు దక్కనిది మంచిది కాదన్నది అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే జాతీయంలో కనిపించే భావం.
మనిషి సంఘజీవి. తోటిమనిషి సహాయ సహకారాలు అతడికి ఎప్పుడూ అవసరమవుతాయి. ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో తన పనులను చక్కపెట్టగలడు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. అండ అంటే ఆదుకొనేవారని అర్ధముంది.