ఒకరిని యాచించేటప్పుడు లేదా కోరి అడిగి తీసుకొనేటప్పుడు ఇచ్చిన దాంతో తృప్తిపడాలి. అంతేకానీ ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని కొసరటం పద్ధతి కాదు.
|
కొడుకును కంటాను అత్తమా అంటే వద్దంటానా కోడలమ్మా అన్నట్టు అన్నది జాతీయం. ఇష్టమైన వస్తువులను లేదా పదార్థాలను ఒకరి దగ్గర నుంచి తీసుకొనేటప్పుడు వాడుకలో ఉన్న జాతీయం ఇది. ఇష్టమైన వస్తువులను ఇస్తామంటే కాదనేవారు ఎవరు? అనే భావంలో ఇది వాడుకలో కనిపిస్తుంది.
|
అసమర్థులు చెప్పే ప్రగల్భాలను గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
|
గంజి తాగటమనేది పేదరికానికి సూచికగా చెబుతారు. కొంతమంది తమకు అన్ని వనరులూ కావలసినంతగా ఉన్నా వాటిని అనుభవించలేక వృథా చేసుకొంటూ లేనివారిలాగానే ఉంటుంటారు. అదెలాగంటే అంతకు ముందుదాకా ఎప్పుడూ గంజి మాత్రమే దొరికేవారికి బియ్యం సరిపోయినంతగా లభించాయట.
|
కాటుక పెట్టుకోవటం అలంకార సూచకం. కూటికి లేకపోవటమంటే పేదరికంలో మగ్గిపోవటమని, ధనహీనస్థితి అని అర్థం. కొంతమంది ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా తిండైనా మానుకుంటారు. కానీ అలంకారాలు చేసుకోవటం మానుకోరు.
|
ఒక పనిని ఒప్పుకున్నప్పుడు దానికి సంబంధించిన వాటన్నిటినీ చెయ్యాల్సిందే. సగం పనులు చేసి మిగతావి చెయ్యటం నాకు ఇష్టం లేదు. నేను చెయ్యను అనంటే అది కుదిరేపనికాదు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఇక్కడ కుక్క అని అనడం నీచత్వానికి ప్రతీక.
|
కాలుజారి నేల మీద పడి నేల అచ్చిరాలేదన్నట్టు అన్నది జాతీయం. ఆడలేక మద్దెల ఓడన్న దానికి ఇది సమానార్థకం. ఓ వ్యక్తి సరిగా చూసుకోకుండా అజాగ్రత్తగా నడుస్తూ జారి కిందపడ్డాడట. అజాగ్రత్తగా ఉండటమన్నది అతడి వైపు నుంచి జరిగిన తప్పు.
|
అణిచివేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కాలితో తన్నటం అన్నా, కాలును ఉపయోగించి ఏదైనా వస్తువును దూరంగా విసిరేయటం అన్నా అవమానం, అసహ్యం లాంటి వాటికి ప్రతీకలుగా కనిపిస్తాయి. అంటే తనకు గిట్టని వాటిని అవమానించేందుకు మనిషి కాలును ఉపయోగిస్తుంటాడు.
|
కొంతమంది అత్యాశకు పోయి అధికంగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పూర్వం కాణీలు, అణాలు ఉన్న రోజుల్లో ప్రచారంలోకి వచ్చిన జాతీయమే అయినా ఈ నాటికీ చాలామందికిది వర్తిస్తుంది.
|
ఆకారానికి మాత్రమే గంభీరంగా ఉండి వ్యవహారంలో తీసివేతగా ఉండే వ్యక్తులను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. కాగితంలో చేసిన పులిబొమ్మ, ఏకులతో చేసిన ఏనుగు బొమ్మ ఆకారానికి మాత్రమే ఆ జంతువులను పోలి ఉంటాయి.
|