దొంగమాటలాడ దొరుకునె మోక్షము
చేతగాని పలుకు చేటుదెచ్చు
గురువుపద్దు కాదు గునహైన్య మదియగు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము
గురువులమని చెప్పి దొంగ మాటలు చెప్పినంతమాత్రాన ముక్తి లభించదు. చేతగాని మాటల వల్ల చేటు కలుగుతుంది. హీనమైన గుణాలుండడం గురువు లక్షణం కాదు.