నమ్మకు సుంకరి జూదరి

నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్
నమ్మకు మంగలివానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

తాత్పర్యము

పన్నులు వసూలు చేసే వానిని, జూదం ఆడేవాడిని, కమసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమ చేతితో పనులు చేసేవాడిని నమ్మవద్దు.