నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
సభల్లో, తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూసి నవ్వరాదు.