నేయి వెన్న కాచి నీడనే యుంచిన
బేరి గట్టిపడును పెరుగురీతి
పోరిపోరి మదిని పోనీక పట్టుము
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము
వెన్నను కాచి నేతిగా మార్చి నీడలో ఉంచితో అది పేరుకుంటుంది. పెరుగులా గట్టిపడుతుంది. మనసు అదుపులో ఉన్నట్లే అనిపించినా… ఏమాత్రం ఉపేక్షించినా పట్టు జారిపోయే ప్రమాదం ఉంది.