పంచ ముఖములందు బంచాక్షరి జనించె
పంచ వర్ణములను ప్రబలె జగము
పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము
శివుడి అయిదు ముఖాల నుంచి పంచాక్షరి వెలువడింది. పంచాక్షరిలోని అయిదు అక్షరాల నుంచి ప్రపంచం పుట్టింది. అందుకే అందరూ ఆ పరమేశ్వరుడినే స్తుతించాలి.