పగలుడుగ నాసలుడుగును 
వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్‌ 
తగులుడుగు భోగముడిగిన 
త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా!

తాత్పర్యము

విరోధములు నశించిన ఆశలు నశించును. విచారము లేకున్న కోరికలు నశించును. భోగములు నశించిన జన్మములు నశించును. త్రిగుణములు నశించిననే కొని ముక్తి కలుగును.