తెలుగు బిడ్డ
పగవల దెవ్వరితోడను వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్ దెగనాడవలదు సభలను మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!
భూమిపై ఎవరితోనూ విరోధం మంచిది కాదు. దార్రిద్య్రం వచ్చిన తరవాత విచారింపరాదు. సభలో ఎవరినీ దూషింపరాదు. స్త్రీకి తన హృదయాన్ని తెలియనీరాదు.