పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము
పదిమంది చెప్పిన మాట అసత్యమైన కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.