పరుల దత్తమొప్పి పాలనచేసిన

పరుల దత్తమొప్పి పాలనచేసిన 
నిల స్వదత్తమునకు విను మడియగు 
నవని పరుల దత్త మహపరింపగ రాదు 
విశ్వధాబిరామ వినురవేమ!

తాత్పర్యము

పరులు ఇచ్చిన దానాన్ని సక్రమంగా ఉపయోగిస్తే దానివల్ల తాను ఇచ్చిన దానం కంటే రెండురెట్ల ఫలం దక్కుతుంది. పరుల సొమ్ము అపహరించడం నీచమైన పని.