పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు
వట్టి మాటలాడు వాడధముడు
అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా
విశ్వధాబిరామ వినురవేమ!
తాత్పర్యము
పరుల మేలు చూసి ఓర్చుకోలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలే తప్ప అసూయపడకూడదు. అలా అసూయపడే వాళ్ల బతుకు నిష్ప్రయోజనం.