పొరుగున పగవాడుండిన నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్ ధరఁగాఁపు కొండెమాడినఁ గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
ఇంటి పక్కనే శతృవు ఉన్నా, బాగా రాయగలవాడే ప్రభువు అయినా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడయినా లేఖరుకు జీవితం గడవదు.