బంగారు కుదువబెట్టకు

బంగారు కుదువబెట్టకు
సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో
నంగడి వెచ్చములాడకు
వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!

తాత్పర్యము

బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు.