బేగంపేట విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెలికాప్టర్ ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో పాటు ఆరు శిక్షణ విమానాలు కాలిబూడిదయ్యాయి. విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న ఏపీ ఏవియేషన్ అకాడమీలోని హ్యాంగర్లలో (విమానాలు, హెలికాప్టర్లుంచే చోటు)ని ఒకదాంట్లో మంటలు అంటుకున్నాయి. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ శబ్దంతోపాటు మంటలు ఎగిసిపడ్డాయి.
2012-12-18