బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి

బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి 
మిత్రచంద్ర శిఖులు నేత్రచయము 
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము

బ్రహ్మం అంటే ఏదో తెలియని తత్వం కాదు. మానవ దేహమే బ్రహ్మ స్వరూపం. గాలి ప్రాణం. కళ్లే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మానవుడే బ్రహ్మమని సాధనతో తెలుసుకోవాలి.