లోభమోహములను ప్రాభవములు తప్పు

లోభమోహములను ప్రాభవములు తప్పు 
తలచిన పనులెల్ల తప్పి చనును 
తానొకటి దలచిన దైవమొండగుచుండు 
విశ్వదాభిరామ వినురవేమ 

తాత్పర్యము

లోభము, మోహము కలవారికి గొప్పతనము దక్కదు. అట్టివారు తలచిన పనులు జరగవు. తానొకటి తలచిన, దైవమొకటి తలచుననుట ఎరిగినదే కదా!