వినియు వినకయుండు కనియు గనక యుండు
తలచి తలపకుండు తాను యోగి
మనుజవరులచేత మణిపూజ గొనుచుండు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము
జ్ఞాని, మోక్ష ధర్మములు వినియు విననట్లును, తత్వమును చూచిచు చూడనట్లును, దేవుని తలచియు తలపనట్లు ఉండును. అట్టి జ్ఞానిని అందరూ పూజిస్తారు.