వేసరవు జాతి కానీ వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ దాసి కొడుకైన గాని కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
శుభముల నొందని చదువును అభినయమున రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా ధారాళమైన నీతులు నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!
సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
సారంబగు నారికేళ సలిలము భంగిన్ గారవమును మరిమీదట భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!
సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!