telugubidda.in
అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్ విడువక కూరిమి సేయకు మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!
వృథా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.