అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ
తాత్పర్యము
అల్పుడికి అధికారమిస్తే మంచివారిని పక్కనపెట్టి వంతపాడేవారిని కొలువులో చేర్చుకుంటాడు. చెప్పుతినే కుక్కకు చెరకు తీపి తెలియనట్లే చెడ్డవారికి మంచివారి విలువ తెలియదు.