ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు
కట్టుపడుచు ముక్తిగానరైరి
జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము
ఆలు, కోరికలతో బంధితులైన ప్రజలు మోక్షాన్ని పొందలేకపోతున్నారు. ఈ కోర్కెలను, ఆశలను అణచివేసేందుకు జ్ఞానమనే ఖడ్గం కావాలి. అందుకే జ్ఞానాన్ని అందరూ ఆర్జించాలి.