ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు
నం దొకండు విడ్డ పొందు చెడును
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము
కలసికట్టుగా ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించవచ్చు. అయిదు వేళ్లు కలిపితే చేయి మరింత బలంగా మారుతుంది. కుటుంబంలోను, కులం, వర్గంలోనూ, అందరూ సయోధ్యగా ఉంటేనే పనులు జరుగుతాయి.