కపటి వేషమూని కడగండ్లు పడనేల 
విపిన భూమి తిరిగి విసుగనేల 
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా 
విశ్వదాభి రామ వినుర వేమ

తాత్పర్యము

కపట వేషాలు వేసి కష్టాలు పడడం, అడవులకు వెళ్ళి విసుగు పుట్టేలా తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముక్తిని పొందడానికి ఎన్నో సులభ మార్గాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే చాలు.