కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్
బ్రేమమున జెరకు పిప్పికి
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!
తాత్పర్యము
విటుడు తృప్తిపడేట్లు భోగించి విడిచన కాంతను మరొకడు జారుడు అనుభవించాలని కోరడం చెరకులోని రసాన్ని సంపూర్ణంగా తీసివేసిన తరవాత పిప్పికై చీమలు ముసుకొన్నట్లు ఉండును.