గంగి గోవుపాలు గరిటడైనను చాలు 
కడవెడైనను నేమి ఖరముపాలు 
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము

ఆవుపాలు కొంచమైనా చాలు గాడిదపాలు కుండనిండా ఉన్నా ప్రయోజనం లేదు. ప్రేమతో పెట్టిన తిండి కొంచమైనా తృప్తి ఇస్తుంది. తిడుతూ ఎంత పెట్టినా తృప్తి ఉండదు.