తెలుగు బిడ్డ
చిక్కియున్నవేళ సింహంబునైనను బక్క కుక్కయైనా బాధసేయు బలిమిలేని వేళ పంతములు చెల్లవు విశ్వదాభిరామ వినురవేమ
ఎంత గొప్పవాడైనా బలహీనుడైనపుడు అల్పుడికైనా లొంగిపోతాడు. చేజిక్కిన సింహాన్ని బక్క కుక్క కూడా బాధించగలదు కదా!