జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినురవేమా
తాత్పర్యము
యోగి కావాలనుకున్నవాడు జాతి, మతాలను విడిచిపెట్టాలి. ఒకవేళ జాతిని ఆశ్రయించినా కూడా నీతిని మాత్రం విడవకూడదు. ఏ జాతివాడైనను దురాచారాలను విడవకపోవడం తప్పు