జాలినొందరాదు జవదాటి కనరాదు 
అది మూలమైన ఆత్మమఱుగు 
పోరిచేరి పొంది పూర్ణము నందురా 
విశ్వదాభిరామ వినురవేమా

తాత్పర్యము

ఆత్మరహస్యమునకుగల మూలతత్త్వమును చూడలేకపోయామని విచారపడినా, యోగనియమములను విడిచినా లాభము లేదు. ఇంద్రియాలను జయించి ఈశ్వరతత్వాన్ని పొందితేనే మేలు.