జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
రెంటినందు రిమ్మరేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము
జ్ఞానం గురువులాంటిది. జ్ఞానం లేకపోతే బుద్ధి అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. చంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానాల మధ్య భ్రమిస్తుంటుంది. ఈ భ్రమలకు అడ్డుకట్ట వేస్తేనే మోక్షం లభిస్తుంది