ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము 
నీటనుండనేని నిక్కిపడును 
అండతొలుగు నెడల నందర పని అట్లే 
విశ్వదాభి రామ వినురవేమ 

తాత్పర్యము

నీటి నుంచి బయటకు వస్తే చేప మృతిచెందుతుంది. నీటిలో ఉంటేనే ఆనందంగా ఆడుతుంది. అలాగే మానవుడు తనకు తడిన ఆధారం ఉంటే ఆహంకారంతో ప్రవర్తిస్తాడు. లేకపోతే అణిగిపడి ఉంటాడు.