telugubidda.in
తములము వేయని నోరును విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్ గమలములు లేని కొలకుఁను హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!
తాంబూలం వేయని నోరు, దుర్మార్గులతో స్నేహం చేసి బాధపడే బుద్ధి, తామరపూలు లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి శోభిల్లవు.