ధూమాదుల నావృతమై
వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో
శ్రీమించు శివుని జేరును
గామాదుల గలియడతడు ఘనముగ వేమా
తాత్పర్యము
భూమిపై ఏర్పడే పొగ మెల్లగా ఆకాశంలో కలుస్తున్నట్లుగానే, మానవునిలో ఉన్న జీవాత్మ ఈశ్వరునితో కలుసుకొనును. అప్పుడు జీవునికి కామాది వికారములుండవు.