నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యము
విలువైన నీలమణి ఒక్కటి చాలు. విలువలేని మెరుగురాళ్లు తట్ట నిండా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. అలాగే చెత్త పద్యాలు వేల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేదు. రసవంతమైన పద్యం ఒక్కటైనా చాలు.