telugubidda.in
నిజములాడు వాని నిందించు జగమెల్ల నిజము బల్కరాదు నీచులకడ నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా విశ్వదాభిరామ వినుర వేమ!
చెడ్డవారితో నిజం చెప్పకూడదు. వారు నిజం చెబితే నమ్మరు. పైగా నిందిస్తారు. ఉత్తముల దగ్గర మాత్రం కచ్చితంగా నిజాన్నే చెప్పాలి.