నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
లింగ జీవావేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగువేమా
తాత్పర్యము
ఎన్ని పనులున్నా కూడా క్షణకాలమైనా తీరిక చేసుకుని నిర్మలమైన మనస్సుతో లింగజీవాత్మ పరమాత్మను నిశ్చలబుద్ధితో చూచి పూజిస్తే పూర్ణపదవి సిద్ధిస్తుంది. మోక్షం కోరుకునే మానవులకు ఇది అవసరం.