పగయుడగు గోపముడిగిన
పగయుడుగన్ కోర్కెలుడుగు బరజన్మంపుం
దగులుడుగు భేదముడిగిన
త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా!
తాత్పర్యము
కోపం నశిస్తే పగ పోతుంది. పగ పోతే కోరికలు ఉండవు. భేదభావాలు లేకపోతే మరో జన్మ లేదు. త్రిగుణాలు నశిస్తే ముక్తి కచ్చితంగా లభిస్తుంది.