పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము
అవగాహన లేకుండా ఏ పనీ ప్రారంభించకూడదు. మనం చేసే పని యోగ్యమైందని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వదలకూడదు. మధ్యలో వచ్చే అంతరాయాలకు, అపాయాలకు, ప్రలోభాలకు గురై పట్టువిడవడం కంటే పడి చచ్చిపోవడమే మంచిది.