పరసతి కూటమి గోరకు
పరధనముల కాసపడకు పరునెంచకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!
తాత్పర్యము
ఇతర స్త్రీలతో కలయికను కోరవద్దు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. ఇతరుల దోషాలను లెక్కించవద్దు. మంచిది కాని సంభాషణ చేయవద్దు. భాగ్యం పోయినప్పుడు బంధువుల వద్దకు చేరకుము.