పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
పురుషుడవనిలోన పుణ్యమూర్తి
పరుల విత్తమరయ పాపసంచితమగు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము
పరుల ధనంపై ఆశ లేనివాడే పురుషుల్లో ఉత్తముడు. పరుల సొమ్ము తీసుకున్నా, అది పాపంతో సంపాదించినదే అవుతుంది. అలా చేసేవాడికి ముక్తి ఉండదు.