telugubidda.in
పులిపాలు దెచ్చిఇచ్చిన నలవడఁగ గుండెగోసి యరచే నిడినం దలపొడుగు ధనము బోసిన వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!
దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అరచేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం పోసినా వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు.