telugubidda.in
వేషధారినెపుడు విశ్వసింపగరాదు వేషదోషములొక విధయె యగును రట్టుకాదె మునుపు రావణు వేషంబు విశ్వదాభిరామ వినురవేమ!
వేషం వేసి నటించడం కూడా మోసం చేయడమే. అలాంటి వారిని నమ్మకూడదు. రావణుడంతటి గొప్పవాడు కూడా వేషం వేసి సీతను అపహరించి అపకీర్తి పాలయ్యాడు