అతిథి రాక చూచి యదలించి పడవైచి

అతిథి రాక చూచి యదలించి పడవైచి 
కఠిన చితులగుచు గానలేరు 
కర్మమునకు ముందు ధర్మము గానరో 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము

అతిథి ఇంటికి రాగానే అతనిని అదిలించి పొమ్మని చెప్పిన కఠినచిత్తులు ధర్మమును గుర్తింపరు.ధర్మము చేసిననే కర్మములు నశించగలవు