ఆశయనెడు దాని గోసివేయగాలేక
మొహబుద్ది వలన మునుగువారు
కాశివాసులైన గనబోరు మోక్షము
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము
ఆశకు లొంగిపోయి అల్లాడేవారు, భోగభాగ్యాల మోహంలో మునిగి తేలేవారు మోక్షాన్ని పొందలేరు. ఇలాంటివారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నివశించినా ముక్తిని పొందలేరు.