ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె
జీవబుద్ధి వలన జీవుడయ్యె
మోహబుద్ధిలయము ముందర గనుగొను
విశ్వదాభిరామ వినురమేమ!
తాత్పర్యము
ఆత్మ అంతా తానే అయినా జీవిస్తూ ఉండడంవల్ల వల్ల జీవుడయ్యాడు. జీవుడికి సహజమైన మోహాలు లోభాలు సహజం. వయస్సు ముదురుతన్న కొద్దీ మోహం ఎక్కువ అవుతుంది.